కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రూ.23123 కోట్లతో కోవిడ్-19 అత్యవసర ప్యాకేజి

Cabinet approves India COVID 19 Emergency Response, Cabinet approves Rs 23123 Cr for India, Cabinet approves Rs 23123 cr India COVID-19 Emergency, Centre approves Rs 23123 cr emergency response package, Corona Emergency Response Package, COVID-19 Emergency Response Package, COVID-19 Emergency Response Package with Rs 23123 cr for 2021-22, Mango News, PM Modi Led Cabinet, Union Cabinet Decisions

కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం నాడు తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • కోవిడ్-19 అత్యవసర స్పందన, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్యాకేజీ కింద 2021-22 సంవత్సరానికి గానూ రూ.23,123 కోట్లుకు కేబినెట్ ఆమోదం. ఈ ప్యాకేజీతో 736 జిల్లాల్లో పీడియాట్రిక్ కేర్ లు ఏర్పాటు, ఐసీయూ పడకలు పెంపు, ఆక్సిజన్‌ నిల్వ కేంద్రాల ఏర్పాటు సహా పలు చర్యలు తీసుకోనున్నారు.
  • కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) మరియు జపాన్ ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (జెఎఫ్‌టిసి) ల మధ్య మెమోరాండం ఆన్ కోఆపరేషన్ (ఎంఓసి) కు కేబినెట్ ఆమోదం.
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఓఎల్) మరియు అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఎసిసిఎ), యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) మధ్య ఎంఓయూకు కేబినెట్ ఆమోదం.
  • అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఫైనాన్సింగ్ సౌకర్యం యొక్క కేంద్ర రంగ పథకంలో మార్పులను కేబినెట్ ఆమోదించింది.
  • రైతుల మౌలిక సదుపాయాల నిధి కింద రూ.లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ అంగీకారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =