రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులతో ఈ నెల 15న కేంద్ర ఆర్థికమంత్రి భేటీ

Finance Minister Nirmala Sitharaman, Finance Minister To Hold Virtual Meet With Chief Ministers, FM Nirmala Sitharaman, FM will urge states to play a bigger role in growth push, Mango News, Minister Sitharaman to Held Virtual Conference with Chief Ministers, Sitharaman to hold virtual meet with CMs, Union Finance Minister Sitharaman, Union Finance Minister Sitharaman to Held Virtual Conference with Chief Ministers, Union Finance Minister Sitharaman to Held Virtual Conference with Chief Ministers on NOV 15th, Union Finance Minister to engage with Chief Ministers

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 15, సోమవారం నాడు వర్చువల్ కాన్ఫరెన్స్ మోడ్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లతో సమావేశం కానున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు మరియు ఆర్థిక కార్యదర్శులు కూడా కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.

దేశంలో కరోనా మహమ్మారిలో తీవ్రత తగ్గుముఖం పట్టిందని, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం తర్వాత, రికవరీ సూచికలు స్పష్టంగా కనిపించడంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుందన్నారు. అనేక ఆర్థిక సూచికలుప్రస్తుతం కరోనా మహమ్మారికి ముందు స్థాయిలలో ఉన్నాయన్నారు. ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క జీడీపీ వృద్ధిని వరుసగా 9.5% మరియు 8.3% కి చేరేలా అంచనా వేస్తున్నాయని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నామని చెప్పారు. ఈ క్రమంలో ఈ సమావేశంలో పరస్పర చర్య ద్వారా, రాష్ట్రాలు పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి తమ ఆలోచనలు మరియు విజన్ పంచుకోవచ్చుని తెలిపారు. అలా చేస్తే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి చేపట్టాల్సిన పథానికి సంబంధించి విస్తృత ఏకాభిప్రాయానికి దారి తీస్తుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =