తుఫాన్లతో నష్టం: ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి 6 రాష్ట్రాలకు రూ.4,381.88 కోట్ల అదనపు సాయం

Union Govt Approves Rs 4,381Cr to 6 States from National Disaster Response Fund

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆరు రాష్ట్రాలకు రూ.4,381.88 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో “అంఫాన్”, “నిసర్గా” తుఫాన్లతో పాటుగా కొండచరియలు విరిగిపడడంతో నష్టపోయిన పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, మరియు సిక్కిం రాష్ట్రాలకోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి ఆరు రాష్ట్రాలకు 4,381.88 కోట్ల సహాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో విపత్తు ఏర్పడినపుడు ప్రకటించిన తక్షణ సాయం కాకుండా ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా ఈ సాయాన్ని అదనంగా ప్రకటించారు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఎన్‌డిఆర్‌ఎఫ్ నుండి 28 రాష్ట్రాలకు రూ.15,524.43 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు.

కేంద్రం నుంచి అదనపు సాయం పొందిన రాష్ట్రాలివే:

  • అంఫాన్ తుఫాను కారణంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు రూ.2,707.77 కోట్లు.
  • అంఫాన్ తుఫాను కారణంగా నష్టపోయిన ఒడిశాకు రూ.128.23 కోట్లు.
  • నిసర్గా తుఫానుకు మహారాష్ట్రకు రూ.268.59 కోట్లు.
  • నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడ్డ కారణంగా నష్టపోయిన కర్ణాటకకు రూ.577.84 కోట్లు.
  • మధ్యప్రదేశ్‌కు రూ.611.61 కోట్లు,
  • సిక్కింకు రూ.87.84 కోట్లు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =