యూపీలో అసెంబ్లీ ఎన్నికలు : 125 మందితో కాంగ్రెస్ తోలి జాబితా, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్

2022 UP assembly election, 2022 Uttar Pradesh Assembly Elections, Assembly Election 2022, Assembly Polls 2022 Live, Bhim Army chief Chandrashekhar Azad meets Akhilesh Yadav, Congress releases first list of 125 candidates, Congress Releases First List with 125 Candidates, Mango News, UP assembly election 2022, UP Polls, Uttar Pradesh Assembly Elections, Uttar Pradesh Assembly Elections 2022, Uttar Pradesh Elections

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, 03, 07 తేదీల్లో 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉండడం, దేశ రాజకీయాలపై ప్రభావితం దృష్ట్యా ప్రస్తుతం అందరి దృష్టి యూపీ ఎన్నికలపై ఉంది. అధికార బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం విస్తృత ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు 125 మంది అభ్యర్థులతో కూడిన తోలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 50 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. కాగా ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి పార్టీ టికెట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, ఉన్నావ్ అభ్యర్థి ఆశా సింగ్ ఒక అత్యాచార బాధితురాలి తల్లి. ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. మేము ఆమెకు అవకాశం ఇచ్చామని చెప్పారు. ఆలాగే ఆశా వర్కర్స్ కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను పట్టించుకోకుండా దేశానికి సేవ చేశారని, వారి గౌరవవేతనం కోసం ఆందోళన చేపట్టి నాయకత్వం వహించిన ఆశా వర్కర్ పూనమ్ పాండే కు షాజహాన్‌పూర్‌ టికెట్ కేటాయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన తొలిజాబితాలో 40 శాతం మహిళలకు, 40 శాతం యువతకు టికెట్స్ కేటాయించినట్టు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =