గూగుల్ మ్యాప్స్‌లో నయా ఫీచర్..

New Feature In Google Maps, Google Maps New Feature, Google Maps Feature, Google Maps, WhatsApp, Location Sharing Option, Latest Google Maps Feature, Latest Google Maps Update, Latest Google Maps News, Google Maps Update, GPS, Route Map, Navigations, Technology, Mango News, Mango News Telugu
Google Maps,WhatsApp,New feature in Google Maps,location Sharing Option

ఒకప్పుడు ఏదైనా ఊరు  వెళ్లాలన్నా, తెలియని  ప్రాంతాలకు వెళ్లాలన్నా బాగా తెలిసిన వారి సహాయమో.. లేదా ఆ ఊరిలో ఎవరో ఒకరిని అడిగో ఆ ప్రాంతాలకు చేరుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది.  చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు స్మార్ట్‌గా కావాల్సిన ప్లేసుకు వెళ్లిపోవచ్చన్న నమ్మకం పెరిగిపోయింది.

అందుకే గూగుల్ మ్యాప్స్ హెల్ప్ తీసుకుని కావాల్సిన ప్లేసులు ఈజీగా తిరిగి వచ్చేస్తున్నారు. కొత్త ప్రదేశాల రూట్ తెలుసుకోవాలన్నా, షార్ట్ కట్ మార్గాలతో ప్రయాణించాలన్నా గూగుల్ మ్యాప్స్‌నే వాడుతున్నారు. ఎప్పటికప్పుడు తమ యూజర్స్ కోసం నయా ఫీచర్స్ అందించే గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌తో వచ్చేసింది.

గూగుల్‌లో ఓన్లీ డెస్టినేషన్ ఒక్కటే కాదు..ఇకపై రియల్ టైమ్ లొకేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి సదుపాయాలు ఉండేలా గూగుల్ మ్యాప్స్ రెడీ అయింది. ఇప్పటి వరకూ వాట్సాప్ లో మాత్రమే  రియల్‌టైమ్ లొకేషన్‌ను వేరే వ్యక్తులకు పంపేవాళ్లం. ఎంత టైమ్ కావాలంటే అంత టైమ్ సెట్ చేసుకునే లైవ్ లొకేషన్‌తో పాటు, ప్రస్తుతం ఉన్న లొకేషన్‌ను వాట్సాప్‌లో పంపేవాళ్లం.

అయితే ఇకపై వాట్సాప్‌తో పని లేదు.  తాజాగా గూగల్ మ్యాప్స్ అందించిన కొత్త ఫీచర్లో.. వాట్సాప్ ఒక్కటే కాదే మరే ఇతర యాప్స్‌తో పని లేకుండా కేవలం సాధారణ మెసేజ్‌ వల్లే రియల్‌టైమ్‌ లొకేషన్‌ పంపుకోవచ్చు. అంతేకాదు వాట్సాప్ కంటే మెరుగైన ఫీచర్‌ను పొందొచ్చు. ఎలా అంటే మనకు వాట్సాప్ ద్వారా లైవ్ లొకేషన్‌ను పంపే సదుపాయం ఉన్నా కూడా..అది  15 నిమిషాలు, 1 గంట, 8 గంటలు వంటి లిమిటేషన్స్ ఉన్నాయి.

కానీ గూగుల్ మ్యాప్స్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో టైమ్ లిమిట్ లేదు.  ఇది ఎంత సేపటికయినా కొనసాగుతూనే ఉంటుంది. మనకు ఇష్టం లేనప్పుడు మాత్రమే ఆపుకోవచ్చు. కాకపోతే  ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలంటే, మనం ఎవరికి లొకేషన్‌ను పంపాలనుకుంటున్నామో వాళ్లు..గూగుల్ మ్యాప్స్ లాగిన్ అయి ఉండాలని గూగుల్ చెబుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 10 =