టికెట్ రాకపోయినప్పటికీ బాధపడను.. పార్టీ కోసం పని చేస్తాం: అమర్నాథ్

Even If We Dont Get The Ticket We Will Not Be Sad We Will Work For The Party Says Amarnath, Even If We Dont Get The Ticket, We Will Work For The Party Says Amarnath, We Will Not Be Sad We Will Work For The Party, Gudivada Amarnath, YCP, CM Jagan, AP Assembly Elections, Latest Gudivada Amarnath Comments, Gudivada Amarnath Comments Update, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Gudivada amarnath, YCP, CM Jagan, AP Assembly elections

అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ ఇంచార్జ్‌ల మార్పు అంశం సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగానే కాక.. వైసీపీలో ఇంటర్నల్‌గా కూడా ఈ అంశం కాక రేపుతోంది. 175కి 175 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న జగన్.. ఎంతటివారినైనా పక్కకు పెట్టేస్తున్నారు. పనితీరు సరిగా లేకున్నా.. నియోజకవర్గంలో నెగిటివీటి పెరిగిపోయినా.. ప్రజల్లో పట్టు తగ్గినా ఏమాత్రం సహించటం లేదు. సీనియర్లను కూడా వదల కుండా పక్కకు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. మొదట 11 మంది ఇంఛార్జ్‌లను మార్చిన జగన్.. ఇప్పుడు మరో 27 మంది ఇంచార్జ్‌లను ఛేంజ్ చేస్తూ రెండో జాబితాను విడుదల చేశారు.

అయితే జగన్ ఇంఛార్జ్‌ల మార్పుకు సంబంధించి కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుండడంతో కొందరు అలకబూనుతున్నారు. అసంతృప్తితో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు తెలుగు దేశం పార్టీలోకి జంప్ అయ్యారు. మరికొందరు కూడా పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల దగ్గరపడుతున్నకొద్దీ మరికొందరు వైసీపీని వీడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో కొందరు వైసీపీ నేతలు మాత్రం తమ టికెట్ దక్కినా.. దక్కకపోయినా జగన్ వెంటే ఉంటామని అంటున్నారు. ఏదిఏమైనా వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని చెబుతున్నారు.

ఈ సమయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడిచే కంటే.. బయటికి వెళ్లిపోవడం మంచిదని అమర్నాథ్ అన్నారు. 2024లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేవారు మాత్రమే పార్టీలో ఉండాలని.. అధినేత జగన్ చెప్పినట్లు చెప్పుకొచ్చారు. టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటానని.. లేదంటే వెళ్లిపోతామని అనుకునే వారు ఇప్పుడే నిర్ణయం తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. దాడి వీరభద్రరావు మళ్లీ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిసిందని చెప్పారు.

తనకు కూడా టికెట్ ఇవ్వకపోతే తాను బాధపడనని చెప్పారు. టికెట్ ఇవ్వకుండా పార్టీ జెండా పట్టుకొని తిరగాలని చెబితే.. తాను కచ్చితంగా నియోజకవర్గం మొత్తం తిరుగుతానని చెప్పుకొచ్చారు. తనకు వ్యక్తిగత అంశాలు ఏవీ ముఖ్యం కాదని.. పార్టీనే మఖ్యమని గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =