40 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలనుకుంటే.. 6 చిట్కాలు ఫాలో అయిపోండి..

People Who are in 40s Have to Follow 6 Tips To Look Younger,People Who are in 40s,Have to Follow 6 Tips To Look Younger,Who are in 40s To Look Younger,Mango News,Mango News Telugu,look young,after 40 years, follow 6 tips, Avoid photoaging,Smoking,Moisturizer,6 Tips To Look Younger,Tips To Look Younger Latest News,Tips To Look Younger Latest Updates,People Who are in 40s News Today

డబ్బున్నవారికి అయినా పేదవారికి అయినా వృద్ధాప్యం ఒక సహజమైన ప్రక్రియ.పెరుగుతున్న వయసుతో చర్మం, శరీరంలో చాలా తేడాలు వస్తాయి. ముఖ్యంగా చర్మం సాగే గుణం తగ్గడం ప్రారంభం అయి ముడుతలు కనిపిస్తూ ఉంటాయి. అయితే డబ్బున్నవాళ్లు అదే డబ్బుతో కేర్ తీసుకోవడం వల్ల దాని ఛాయలు కొన్నాళ్లును మరుగున పడతాయి.అయితే ఎలాంటి వారు అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 40 ప్లస్ లోనూ నిగనిగలాడే చర్మంతో మెరిసిపోవచ్చట.

చాలా మంది ఏజ్‌డ్ వారిలా కనిపించినా కొంతమంది మాత్రం వారి ఏజ్‌ కంటే ఇంకా చిన్నవారిలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్లు తీసుకునే ఆహారంతో పాటు.. వారి జీవనశైలి, ఇంకా చర్మాన్ని సంరక్షించుకునే పద్ధతి వల్ల చిన్నవారిలా కనిపిస్తారు. అందుకే 30 దాటాయంటే మీ చర్మంపై మీరు కేర్ తీసుకోక తప్పదు. అందులోనూ 40 ఏళ్ల వయస్సులోకి ఎంటర్ అయితే మాత్రం తప్పనిసరిగా స్కిన్ కేర్ గురించి పట్టించుకోవాల్సిందే అంటున్నారు డెర్మటాలజిస్ట్స్.

ముందుగా ఫోటోయేజింగ్‌ను నివారించాలి..

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ చెప్పిన దాని ప్రకారం.. సూర్యుడి యూవీ కిరణాలు చర్మంపై పడినప్పుడు ఫోటోయేజింగ్ ప్రాబ్లెమ్ మొదలవుతుంది. ముఖ్యంగా.. బయటకు వెళ్లినప్పుడు అది ఉదయం అయినా కూడా డైరక్ట్ ఎండ మీ మీద పడకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లినపుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. చర్మానికి సూర్యరశ్మి తగలకుండా క్లాత్ కట్టుకోవాలి. అలాగే సన్ గ్లాసెస్ వాడటం మంచది.

రోజూ మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలి..

వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో తేమ మాయమయిపోతుంది. దీనివల్లే ముడతలు ప్రారంభమవడం, చర్మం డ్రైగా తయారవడం అవుతాయి. అందుకే ప్రతి రోజూ స్నానం అయ్యాక తప్పనిసరిగా మంచి మాయిశ్చరైజర్‌ను చర్మానికి రాస్తూ ఉండాలి. దీని వల్ల చర్మం పొడిబారదు.

స్కిన్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి..

ఏ కాలం అయినా రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది. దీనివల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది. అయితే వేడి నీళ్ల కంటే చల్లటి నీళ్లే స్నానానికి, ముఖం కడుక్కోవడానికి వాడాలి. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో గోరువెచ్చని నీళ్లు వాడొచ్చు. సబ్బుకు బదులు సున్నిపిండి వాడటం మంచిది.

స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయాలి..

ఒకవేళ మీకు స్మోకింగ్ అలవాటు కానీ ఉంటే 40 దాటాక మానేయాలి. దీనివల్ల వాటిలో ఉండే టాక్సిన్స్ చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే చర్మంపై ముడుతలు వస్తాయి. అందుకే దీనికి దూరంగా ఉండాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..

40 దాటాక ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఏదో తిన్నాం ..లేదా ఏవి పడితే అవి తిని కడుపు నింపేసుకున్నాం అని ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నవాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల చర్మం మెరుస్తూ.. నిగారిస్తూ ఉంటుంది.

తగినంత నిద్ర పోవాలి..

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు త్వరగా ముసలివాళ్లు కాకూడదు అంటే తగినంత నిద్రపోవాలి. వ రాత్రి తగినంత నిద్ర పోతేనే.. ఆ సమయంలో మీ మెదడుతో పాటు మీ శరీరం కూడా రిఫ్రెష్ అవుతుంది. ఇవన్నీ పాటిస్తే 40 దాటినా యవ్వనంగా మెరిసిపోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + six =