ఆరోరోజున 1,49,970 మంది రైతుల ఖాతాల్లో రూ.262.60 కోట్ల రైతుబంధు నిధులు జమ

Agriculture Minister Niranjan Reddy Says Rs 262.60 Cr Rythu Bandhu Funds Deposited in Accounts of 1.49 Lakh Farmers on 6th Day,Agriculture Minister Niranjan Reddy,Rythu Bandhu Funds Deposited,Accounts of 1.49 Lakh Farmers,Rythu Bandhu will Deposit within 10 Days,CM KCR 100 Cr for Kondagattu Anjanna Temple,Kondagattu Anjanna Temple Devolepment,Kondagattu Anjanna Temple,Rythu Bandhu,Telangana Rythu Bandhu,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్ కు సంబంధించిన రైతుబంధు నగదు పంపిణీ డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోరోజైన జనవరి 3, మంగళవారం నాడు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆరో రోజు మొత్తం 1,49,970 మంది రైతుల ఖాతాలలో రూ.262.60 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. 5,25, 200.21 ఎకరాలకు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 51,50,958 మంది రైతులకు గానూ రూ.3767.35 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు తెలిపారు.

దేశమంతా తెలంగాణ పథకాలు అమలు కావాలని, సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికి అత్యవసరమని ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. “కేంద్రంలోని పాలకులపై సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలపై సమాజంలో చర్చ మొదలయింది. రైతాంగానికి సాగునీరు, ఉచిత కరంటుపై పాలకుల వైఖరి మారాలి. ఉచితం అంటే అనుచితంగా మాట్లాడుతున్నారు. అన్నం పెట్టే అన్నదాతలను చులకనగా చూస్తున్నారు. దేశంలో 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలని ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ వినూత్న పథకాలతో పటిష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయకున్నా కరంటు, సాగునీరు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలు చేస్తున్నారు. దేశమంతా ఈ పథకాలు అమలైతే దేశ వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది” అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =