ఇడబ్ల్యుఎస్ లకు 10 రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం నిర్ణయం: సీఎం కేసీఆర్

#KCR, 10 Percent Reservation to EWS, 10% quota for EWS in govt, Economically Weaker Section, Economically Weaker Section Reservation, EWS Reservation, EWS reservation in higher education, Mango News, reservation for EWS, Reservation to EWS, Telangana CM KCR, Telangana Govt Decides to Implement 10 Percent Reservation to EWS, Telangana second state to implement reservation for EWS

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్ల్యు.ఎస్ లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇ.డబ్ల్యు.ఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 8 =