చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం కేసీఆర్

2021 National Handloom Day, CM KCR Conveyed Greetings to Handloom Workers, CM KCR Conveyed Greetings to Handloom Workers on the Occasion of National Handloom Day, Handloom Workers, KCR Conveyed Greetings to Handloom Workers, National Handloom Day, National Handloom Day 2021, National Handloom Day Greetings, National Handloom Day Greetings to Handloom Workers, National Handloom Day News, Occasion of National Handloom Day, Telangana CM KCR

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత, పవర్ లూమ్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నేతన్నల సంక్షేమానికై వినూత్న పథకాల అమలుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో, గత పాలనలో కునారిల్లిన చేనేత రంగాన్ని అనతికాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామని, బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: 

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులు అందిస్తున్నాం. ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తున్నాం. రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని తెస్తున్నాం. రుణమాఫీ పథకం, ‘నేతన్నలకు చేయూత’, ‘చేనేత మిత్ర’ వంటి పథకాల ద్వారా చేనేత సొసైటీలకు వాటా ధనం కల్పన, నూలు, రంగులు, రసాయనాలపై సబ్సిడీ, చేనేత మగ్గాల ఆధునీకరణ వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =