సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు, సీఎం కేసీఆర్ నిర్ణయం

CM KCR Decided to Increase Retirement Age of Singareni Workers, CM KCR Decided to Increase Retirement Age of Singareni Workers to 61 Years, KCR Decided to Increase Retirement Age of Singareni Workers, Mango News, Retirement Age of Singareni Workers, Retirement Age of Singareni Workers Increase, Retirement Age of Singareni Workers Increase News, Retirement age of Singareni workers increased to 61, Singareni workers’ retirement age enhanced to 61 years, TRS govt increased the retirement age of Singareni workers

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. అలాగే రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.

సింగరేణి ప్రాంత సమస్యలు-పరిష్కారాలు అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్ లో మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆంత్రం సక్కు, సిర్పూర్ ఖాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − two =