రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Implementation of Revised Market Values, Implementation of Revised Market Values In Telangana, Implementation of Revised Market Values in the State, Land market value, Land market value stamp duty rates revised in Telangana, Mango News, Telangana Govt, Telangana Govt Issued Orders Over Implementation of Revised Market Values, Telangana Govt Issued Orders Over Implementation of Revised Market Values in the State, Telangana Market values of lands revised, Telangana Market values of lands revised in State

రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్‌ విలువలు జూలై 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ‘బేసిక్ వాల్యూ’ అని కూడా పిలువబడే ‘మార్గదర్శకాల మార్కెట్ విలువ’ ను చివరిగా 2013లో సవరించారు. ఈ నేపథ్యంలో ఏడు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్స్, స్టాంప్ డ్యూటీ రేట్లు/రిజిస్ట్రేషన్‌ ఫీజులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వ్యవసాయ భూములకు అతి తక్కువ/కనిష్ట విలువను ఎకరాకు రూ.75,000 గా నిర్ణయించారు. వ్యవసాయ భూముల కోసం కనిష్ఠ శ్రేణిలో (లోయర్ రేంజ్) ఇప్పుడు ఉన్న విలువలు 50%, మధ్య పరిధి(మిడ్ రేంజ్) లో 40% మరియు అధిక పరిధిలో(హైయర్ వ్యాల్యూ)లో 30% పెంచబడ్డాయి. ఇక ఓపెన్‌ ప్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి రూ.100 నుంచి రూ.200కు, ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్ కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ.800 నుంచి రూ.1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కూడా 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. సవరించిన మార్కెట్ విలువలు మరియు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు జూలై 22 నుండి అమలు చేయబడతాయని చెప్పారు. జూలై 22 లేదా ఆ తరువాత రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే చెల్లింపులు జరిపి స్లాట్స్ బుక్ చేసుకున్న వారు కొత్త రేట్ల ప్రకారం అదనపు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =