హుజురాబాద్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులందరికి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు

BJP Candidate Eatala Rajender Won, BJP Candidate Eatala Rajender Won in Huzurabad By-election, Eatala Rajender, Eatala Rajender Thanked Huzurabad People Party Leaders, Eatala Rajender Thanked Huzurabad People Party Leaders for Supporting, Eatala Rajender Thanked Huzurabad People Party Leaders for Supporting in By-election, Eatala Rajender Won in Huzurabad, Eatala Rajender Won in Huzurabad By-election, Huzurabad Assembly Election Results, Huzurabad Assembly Election Results 2021, Huzurabad bypoll results, Huzurabad constituency, huzurabad election results, Huzurabad Election Results 2021, huzurabad election results exit poll, huzurabad exit poll 2021, Huzurabad exit poll results, huzurabad results, Mango News

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23,855 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన గెలుపుకోసం కృషిచేసిన నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులందరికి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ధర్మం ఒకవైపు-అధర్మం ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు-అహంకారం ఒకవైపు, జనబలం ఒకవైపు-ధనబలం ఒకవైపు, ప్రజా విజయం ఒకవైపు-పరాజయం ఒకవైపు…కష్ట కాలంలో కడుపులో పెట్టుకున్న ప్రతి తల్లికి, అండగా నిలిచిన ప్రతి అన్నకు, తోడు నడిచిన ప్రతి తమ్ముడికి, సాయమొచ్చిన ప్రతి సోదరికి, హితులకు, శ్రేయోభిలాషులకు, అనుచరులకు, సహచరులకు, వెన్ను తట్టిన పార్టీకి, వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ…అఖండ విజయంతో ఏడో సారి ఆశీర్వదించి, హుజురాబాద్ ఆత్మ గౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగరేసిన..నా ప్రజా కుటుంబానికి పేరు పేరునా పాదాభివందనం. ఈ విజయం మీది-ఈ ఊపిరి మీది…ఇప్పటికీ.. ఎప్పటికీ..” అని ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు.

హుజురాబాద్ లో పోస్టల్ ఓట్లతో కలుపుకుని మొత్తం 2,05,965 ఓట్లు పోల్ అవగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కి 1,07,022 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 83167, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కు 3014 ఓట్లు లభించాయి. ఇక ఇతరులకు 11726 ఓట్లు రాగా, నోటాకు 1036 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు నిలవగా, 28 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + four =