పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరుతో కొత్తపార్టీ ప్రకటన

Amarinder Singh, Amarinder Singh Officially Resigns From Congress, Amarinder Singh Resigns, Amarinder Singh Resigns News, Announces Punjab Lok Congress Party, Capt Amarinder Singh resigns from Congress, CM Amarinder Singh Officially Resigns, CM Amarinder Singh Officially Resigns from Congress, Former Punjab CM Amarinder Singh resigns, Mango News, Punjab Former CM, Punjab Former CM Amarinder Singh, Punjab Former CM Amarinder Singh Officially Resigns from Congress

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం నాడు కాంగ్రెస్‌ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 7 పేజీలతో కూడిన రాజీనామా లేఖను పంపించారు. అలాగే తన పెట్టబోయే కొత్త పార్టీ పేరును కూడా అమరీందర్ సింగ్ ప్రకటించారు. తన పార్టీకి “పంజాబ్ లోక్ కాంగ్రెస్” అనే పేరును నిర్ణయించామని, తమ పార్టీ రిజిస్ట్రేషన్ ఎన్నికల కమిషన్ వద్ద అనుమతి కోసం పెండింగ్‌లో ఉందని తెలిపారు.

ముందుగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో తీవ్ర విబేధాలు కారణంగా గత సెప్టెంబరులో అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పుడే కాంగ్రెస్ ను వీడి భవిష్యత్ లో సొంత పార్టీ పెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. కేంద్ర తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, ఇతర రైతుల సమస్యలను పరిష్కరిస్తే బీజేపీ పార్టీతో కూడా పొత్తు విషయంలో ఆలోచన చేయనున్నట్టు అమరీందర్ సింగ్ ప్రకటించారు. మరోవైపు 2022లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ సహా పలు పార్టీలను ఎదుర్కొని అమరీందర్ సింగ్ పెట్టబోయే పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపనుందో వేచిచూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =