వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు, నాలుగురోజుల పాటుగా హెలీకాప్టర్‌ సేవలు

Helicopter Paid Services For Vemulawada Jatara, Helicopter Service Available from Today for Vemulawada Shivaratri Jatara, Helicopter service for Vemulawada jatara, Helicopter Service for Vemulawada Shivaratri Jatara, Helicopter services for Vemulawada temple, Helicopter services to Vemulawada, Mango News, telangana, Telangana Tourism, vemulawada, Vemulawada jatara, Vemulawada Shivaratri Jatara, Vemulawada temple

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో వేడుకలు ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి వేడుకలకు హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులకు బుధవారం నుంచి శనివారం వరకు నాలుగురోజుల పాటుగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ముందుగా వేములవాడలో ఆలయ చెరువు ప్రాంతంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం నాడు వేములవాడలో శివరాత్రి జాతరపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం మాదిరిగానే భక్తుల సౌలభ్యం కోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంచబడతాయని, హైదరాబాద్ నుంచి ప్రయాణించాలనుకునే భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే జాతర సమయంలో భక్తులు మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని కొనసాగించాలని కోరారు.

ఈ హెలికాఫ్టర్ సేవల్లో భాగంగా మూడు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ నుండి వేములవాడ (రౌండ్ ట్రిప్) కు ఒక్కో వ్యక్తికి రూ.25 వేలు చొప్పున వసూలు చేయనున్నారు. ఒక్కో ట్రిప్ కు ఆరుగురు వ్యక్తులు కలసి ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే వేములవాడ క్షేత్రం విహాంగ వీక్షణ ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున తీసుకోనున్నారు. ఈ విహంగ వీక్షణం 7 నిమిషాల పాటు ఉండనుంది. అలాగే వేములవాడతో పాటు నాంపల్లి మీదుగా మిడ్-మనైర్ పై 15 నిమిషాల పాటుగా సాగే విహాంగ వీక్షణానికి ఒక్కొక్కరికి రూ.5500 వసూలు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =