మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం అదేనా?

Is That The Reason Behind Minister Jayarams Anonymity, Reason Behind Minister Jayarams Anonymity, Minister Jayarams Anonymity, Minister Jayaram, AP, YCP, AP Politics, AP Elections, Latest YCP Political News, TDP News AP, Ap CM Jagan, Andra Pradesh, YCP Elections News, Political News, AP, Mango News, Mango News Telugu
Minister Jayaram, AP, YCP, AP Politics, AP Elections

ఇంఛార్జ్‌ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. టికెట్ దక్కని నేతలంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలోకి ఫిరాయిస్తే.. మరికొంత మంది నేతలు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో టికెట్ దక్కిన నేతల గెలుపు కోసం సహకరించేందుకు టికెట్ దక్కని నేతలు ముందుకు రావడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. వైసీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా.. సీనియర్లు, కీలక నేతలు ఫోన్లు చేసినా కూడా అందుబాటులోకి రావడం లేదట.

వైసీపీ సీనియర్ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం ప్రస్తుతం ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరించింది. ఈసారి జయరాంను పక్కకు పెట్టి..విరూపాక్షిని ఆలూరు ఇంఛార్జ్‌గా జగన్మోహన్ రెడ్డి నియమించారు. అలాగే నాలుగో జాబితాలో జయరాంను కర్నూల్ లోక్‌సభ ఇంఛార్జ్‌గా నియమించారు. అయితే తనకు కర్నూల్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని.. ఆలూరు నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని జయరాం అంటున్నారు.

కానీ పార్టీ హైకమాండ్ కర్నూల్ నుంచే ఎంపీగా పోటీ చేయాలనని ఆదేశించడంతో జయరాం అలకబూనారు. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హైకమాండ్‌కు కూడా దూరంగా ఉంటున్నారు. మొన్న నాలుగు రోజుల పాటు బెంగుళూరులో గడిపిన జయరాం ఆ తర్వాత తన నియోజకవర్గానికి వెళ్లారు. ఆలూరు వైసీపీ ఇంచార్జ్ విరూపాక్షిని కలిసేందుకు జయరాం ప్రయత్నించారట. అయితే జయరాంను కలిసేందుకు విరూపాక్షి ముందుకు రాలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. పార్టీ ముఖ్య నేతలు ఫోన్ చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రావడం లేదట. ఆలూరును వదులుకోవడం ఇష్టంలేకనే జయరాం అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =