ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న 10 మంది హైదరాబాదీలు

Hurun Global Rich List, Hurun Global Rich List 2021, Hurun Telangana Rich List, Hyderabad Billionaires, Hyderabad Billionaires List, Hyderabad Billionaires on Hurun Global Rich List, IIFL Wealth Hurun Andhra Pradesh and Telangana Rich List, List of 10 Hyderabad Billionaires on Hurun Global Rich List, List of 10 Hyderabad Billionaires on Hurun Global Rich List -2021, Mango News, Ten Hyderabadi billionaires figure in Hurun Rich List

తాజాగా ప్రకటించిన ‘హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021’ జాబితా టాప్-10 లో భారత్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. 83 బిలియన్‌ డాలర్లు సంపదతో ముకేశ్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. అలాగే హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ ప్రకారం భారత్‌ లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో హైదరాబాద్ నగరానికి చెందిన 10 మంది ప్రముఖులకు చోటు దక్కింది.

హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2021 లో చోటు దక్కిన 10 మంది హైదరాబాద్ బిలియనీర్ల జాబితా:

  • మురళి దివీ అండ్ ఫ్యామిలీ – దివీస్‌ ల్యాబోరేటరీస్‌ – రూ.54,100 కోట్లు – భారత్‌ లో 20వ స్థానం – ప్రపంచంలో 385 స్థానం
  • పీవీ రాంప్రసాద్‌ రెడ్డి – అరబిందో ఫార్మా – రూ.22,600 కోట్లు – భారత్‌ లో 56వ స్థానం – ప్రపంచంలో 1,096వ స్థానం
  • బి.పార్ధసారథి రెడ్డి – హెటిరో డ్రగ్స్‌ – రూ.16 వేల కోట్లు – భారత్ ‌లో 83వ స్థానం – ప్రపంచంలో 1,609వ స్థానం
  • కె.సతీశ్‌రెడ్డి – డాక్టర్‌ రెడ్డీస్‌ – రూ.12,800 కోట్లు – భారత్ ‌లో 108వ స్థానం – ప్రపంచంలో 2,050వ స్థానం
  • జీవీ ప్రసాద్‌ అండ్‌ జి.అనురాధ – డాక్టర్‌ రెడ్డీస్ – రూ.10,700 కోట్లు – భారత్‌లో 133వ స్థానం – ప్రపంచంలో 2,238వ స్థానం
  • పి.పిచ్చి రెడ్డి – మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ – రూ.10,600 కోట్లు – భారత్ ‌లో 134వ స్థానం – ప్రపంచంలో 2,383వ స్థానం
  • జూపల్లి రామేశ్వర్‌రావు – మై హోం ఇండస్ట్రీస్ ‌- రూ.10,500 కోట్లు – భారత్‌లో 138వ స్థానం – ప్రపంచంలో 2,383వ స్థానం
  • పీ.వీ.కృష్ణారెడ్డి – మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ – రూ.10,200 కోట్లు – భారత్‌లో 140వ స్థానం – ప్రపంచంలో 2,383వ స్థానం
  • ఎం.సత్యనారాయణ రెడ్డి – ఎంఎస్‌ఎన్‌ ల్యాబోరేటరీస్ ‌- రూ.9,800 కోట్లు – భారత్‌లో 143వ స్థానం – ప్రపంచంలో 2,530వ స్థానం
  • వీసీ నన్నపనేని – నాట్కో ఫార్మా – రూ.8,600 కోట్లు – భారత్‌లో 164వ స్థానం – ప్రపంచంలో 2,686వ స్థానం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 18 =