తెలంగాణలో నేటి నుండి మెగా కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమం

Corona Vaccination Programme, COVID 19 Vaccine, Covid Vaccination, Covid-19 Vaccination, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccination Drive In Telangana, Mango News, Mega Covid-19 Vaccination Drive, Mega Covid-19 Vaccination Drive for 18 +, Mega Covid-19 Vaccination Drive for 18 + Age Group in Telangana, Mega Covid-19 Vaccination Drive for 18 + Age Group in Telangana State Starts from Today, Telangana COVID-19 Vaccination Drive

రాష్ట్రంలో సెప్టెంబర్ 16, గురువారం ప్రారంభమయ్యే ప్రత్యేక కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ స‌భ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు స్వచ్చంద సంస్థలు భాగస్వామ‌లై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. హైద‌రాబాద్ సచివాలయం నుంచి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర ఉన్న‌తాధికారులు, వివిధ శాఖల కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జెడ్పీ చైర్మన్లు, డిపివోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

కరోనా మహమ్మారి నుండి తెలంగాణ ప్రజలను కాపాడటానికి ప్రతిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదని సదుద్దేశంతో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ద‌యాక‌ర్ రావు అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని, ఇప్పటి వరకు రెండు కోట్ల 17 వేలమందికి వాక్సిన్ ఇచ్చామని తెలిపారు. వీరిలో ఒక కోటి 45 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింద‌ని, 55 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్పూర్తితో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలన్నారు. గ్రామాలు, వార్డు వారిగా ప్రణాళిక చేసుకోవాలి. గ్రామస్థాయిలోనే వ్యాక్సినేషన్ క్యాంపు ఏర్పాటు చేసి అందరికి 100% వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. తహసిల్దారు, యం.పి.డి.ఓ, మెడికల్ ఆఫీసర్ మండల స్థాయిలో సమన్వయం చేసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో బాగా పనిచేసిన జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవార్డులు ప్రకటిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 1,34,98,073 మంది ఇంకా వాక్సిన్ తీసుకోవాల్సి ఉందని వీరెందరికీ రేపటి నుండి ప్రారంభమయ్యే స్పెషల్ వాక్సినేషన్ కార్యక్రమంలో వేయడం జరుగుతుందని అన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికి ఆశా, అంగన్వాడీ, స్థానిక సంస్థల సిబ్బంది వెళ్లి వాక్సిన్ తీసుకోనివారి జాబితాను రూపొందిస్తారని, గుర్తించిన వారికి వాక్సిన్ ఇచ్చి ఆ ఇంటిపై వాక్సిన్ కు సంబందించిన స్టిక్కర్ వేస్తారని పేర్కొన్నారు. ప్రతీ మున్సిపాలిటీకి, మండలానికి వాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ వార్డును యూనిట్ గా చేసుకొని సూక్ష్మ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రతీ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫ‌రేన్స్‌లో పంచాయ‌తీరాజ్ శాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, వైద్య ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వి, సీడీఎంఏ ఎన్‌.స‌త్య‌నారాయ‌ణ‌, పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి క‌మిష‌న‌ర్ ఏ.శ‌ర‌త్‌, డీఎంహెచ్ శ్రీ‌నివాస్ రావు, డీఎంఈ ర‌మేశ్ రెడ్డి, సీఎం ఓఎస్‌డీ గంగాధ‌ర్‌, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 11 =