ధాన్యం కొనుగోళ్ళ ప్రగతిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

Minister Harish Rao Held Teleconference over Paddy Procurement Progress,Mango News,Mango News Telugu,Minister Harish Rao,Minister Harish Rao Latest News,Minister Harish Rao Live,Minister Harish Rao Live News,Minister Harish Rao Live Updates,Minister Harish Rao Latest Updates,Minister Harish Rao News,Minister Harish Rao Pressmeet,Minister Harish Rao Pressmeet Live,Paddy Procurement Progress,Minister Harish Rao Held Teleconference,Harish Rao,Harish Rao News,Minister Harish Rao Teleconference,Paddy Procurement,Minister Harish Rao Held Teleconference Over Paddy Procurement,Minister Harish Rao On Paddy Procurement,Minister Harish Rao teleconference,Telangana News,Telangana News Today,KCR,CM KCR,Harish Rao Teleconference News

సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళ ప్రగతిపై క్షేత్ర బాధ్యులతో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు చెల్లింపులకు వీలుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు 24 గంటల్లో జమ చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం అని అన్నారు. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలనీ ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు.

ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ కానీ వివరాలను వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అలాగే టార్ఫలిన్, గన్ని బ్యాగులు కొరత, ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అకాల వర్షాలు వల్ల పంట తడవకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారిదే బాధ్యత అని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =