అమెరికాను ఒణికిస్తున్న టోర్నడోలు

Kentucky tornado, tornados, US Tornadoes,United State of America,Mango News, Mango News Telugu,Kentucky tornado death toll, Tornado kills,Tornadoes in the United States, More Than 100 People Killed in Tornado, Illinois Governor J.B. Pritzker, Deadly Tornado Storms Strike US, Deadly Tornado Strom,

అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోలు ఒణికిస్తున్నాయి. క్షణక్షణానికి దిశను మార్చుకుంటూ అతివేగంతో ప్రయాణించే సుడిగాలులను టోర్నడోలుగా వ్యవహరిస్తారు అక్కడి ప్రజలు. ఇవి అమెరికాలో తరచుగా సంభవిస్తుంటాయి. టోర్నడోలు వచ్చాయంటే కొన్ని గంటలపాటు అక్కడి ప్రజా జీవనం స్తంభించి పోతుంది. చాలామంది అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి తలదాచుకుంటారు. తమ దారికి అడ్డం వచ్చిన ఎంత పెద్ద వస్తువునైనా అవలీలగా గాలిలోకి ఎత్తి పడేస్తాయి. ఒక మాములు కర్ర ముక్క కూడా ఆ సమయంలో పదునైన ఆయుధంగా మారుతుందంటే టోర్నడోలు ఎంత ప్రమాదకరమో ఊహించుకోవచ్చు. వాటి వలన జరిగే నష్టాన్ని అంచనా వేయటం కూడా చాలా కష్టం.

అలాంటిది ఇప్పుడు వచ్చిన టోర్నడో అమెరికాలో ఈ మధ్యకాలంలో వారు చూడనిది. ఇప్పటికే దీని కారణంగా 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కెంటకీ ప్రాంతంలో ఈ టోర్నడో భీభత్సం సృష్టించినట్లు అక్కడి గవర్నర్ తెలిపారు. టోర్నడోలో చిక్కుకుని 50 మంది చనిపోయారని తెలియజేశారు. కెంటకీలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు గవర్నర్ తెలిపారు. ఇల్లినాయిస్ లోని అమెజాన్ గోడౌన్ లో 100 మంది సిబ్బంది చిక్కుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు 5 రాష్ట్రాలలో ఈ టోర్నడో కారణంగా వందలాది ఇళ్ళు ధ్వంసం అయ్యాయని, విపరీతమైన ఆర్ధిక నష్టం జరిగిందని అక్కడి అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =