కవాల్ టైగర్ రిజర్వ్ పై వెబ్‌సైట్ ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister Indrakaran Reddy Launches Kawal Tiger Reserve Website, Minister Indrakaran Reddy Launched Kawal Tiger Website, Kawal Tiger Reserve Website Launch By Indrakaran Reddy, Minister Indrakaran Reddy Website Launch, Mango News, Mango News Telugu, Minister Indrakaran Reddy, Kawal Tiger Reserve, Minister Indrakaran Reddy Latest News And Updates, Kawal Wildlife Sanctuary, Kawal Tiger Reserve Website, Telangana News,

చిక్కటి అడవి, ప్రకృతి రమణీయత, జలపాతాలతో అలరారుతున్న కవాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్ ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగకరమైన పూర్తి సమాచారం ఉన్న వెబ్‌సైట్ ను మంగళవారం అరణ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కవాల్ అటవీ ప్రాంతం ప్రత్యేకత, విస్తరించిన ప్రాంతాలు, జంతువులు, పక్షి, చెట్ల జాతుల వివరాలు, దర్శనీయ స్థలాలతో పాటు, ఎకో టూరిజం ప్రాంతాలు, సఫారీ, అన్ లైన్ బుకింగ్ వివరాలను www.kawaltiger.com వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.

అలాగే కవాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై (గ్రాస్ లాండ్స్) ప్రత్యేక బుక్ లెట్ ను కూడా మంత్రి విడుదల చేశారు. కవాల్ ప్రాంతం పూర్తి స్థాయిలో పులులకు శాశ్వత ఆవాసంగా మారేందుకు అవసరమైన చర్యలను అటవీ శాఖ పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. దీనిలో భాగంగా శాఖాహార జంతువుల వృద్దికి అవసరమైన గడ్డి మైదానాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రాస్ ప్లాట్ ల గుర్తింపు, విత్తనాల సేకరణ, మైదానాల అభివృద్ది అమలు చేయటంతో కొన్నేళ్లుగా మంచి ఫలితాలను కనిపిస్తున్నాయి. శాఖాహార జంతువుల లభ్యత పెరిగితే, వాటిపై ఆధారపడే పులుల లాంటి మాంసాహార జంతువుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గతంతో పోల్చితే జంతువుల సంఖ్య పెరిగిందని, కవాల్ అభయారణ్యం సిబ్బంది బాగా పనిచేస్తున్నారని ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ ను ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. కవాల్ లో ప్రయోగాత్మకంగా అభివృద్ది చేసిన గడ్డి మైదానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోందని, జాతీయ పులుల సంక్షణ సంస్థ (ఎన్టీసీఏ) నిపుణులు కూడా ప్రశంసించారని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు. రాష్ట్రంలో మరొక పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వు వార్షిక పరిపాలన నివేదికను మంత్రి చేతుల మీదుగా అధికారులు విడుదల చేశారు. అమ్రాబాద్ అడవి ప్రత్యేకతలు, నిర్వహణ, జంతు సంరక్షణ, సిబ్బంది యాజమాన్యం తదితర అంశాలతో కూడిన ఈ వార్షిక నివేదికను ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ రూపొందించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 2 =