రాష్ట్రంలో అప్పులు లేని రైతులను చూడాలనేదే ప్రభుత్వం సంకల్పం : మంత్రి కేటీఆర్

Crop Loan Waiver For Farmers, farm loan waiver, Farmer Loan Waiver Guidelines, Farmers Loan Waiver, Farmers Loan Waiver In Telangana, Loan waived, Loan Waiver, Mango News, Minister KTR, Minister KTR About Farmers Loan Waiver, Minister KTR About Farmers Loan Waiver and TRS Govt’s Commitment towards Farmers, Telangana CM, Telangana Farmers Loan Waiver, telangana government, TRS Govt’s Commitment towards Farmers

తెలంగాణ రాష్ట్రంలో రైతుల శ్రేయస్సు పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అప్పులు లేని రైతులను చూడాలనేదే ప్రభుత్వం సంకల్పమని చెప్పారు. శనివారం రాష్ట్రంలో జరుగుతున్న రైతుల రుణమాఫీ ప్రక్రియపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014లో 1 లక్ష వరకు ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పామని, ఆ వాగ్దానానికి కట్టుబడి మొత్తం 35.19 లక్షల రైతులకు 16144.10 కోట్ల రుణాలును మాఫీ చేసినట్టు తెలిపారు.

అలాగే 2018లో కూడా రైతుల కోసం ఇదే విధమైన వాగ్దానాన్ని ఇచ్చాం. అందులో భాగంగా కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల మధ్యలో కూడా తెలంగాణ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని చెప్పారు. తాజాగా 50 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడం ద్వారా మొత్తం 9 లక్షల మందికిపైగా రైతులకు ప్రభుత్వం సహాయం చేసిందని అన్నారు. రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 12 =