ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు

Minister KTR Inaugurates LB Nagar RHS Flyover Constructed under Strategic Road Development Programme,Minister KTR Inaugurates LB Nagar RHS Flyover,RHS Flyover under Strategic Road Development Programme,Minister KTR under Strategic Road Development Programme,Mango News,Mango News Telugu,Now Its a Signal Free Drive From Vijayawada,Telangana Min inaugurates LB Nagar RHS Flyover,KT Rama Rao to inaugurate RHS Flyover,LB Nagar RHS Flyover Latest News,Minister KTR Latest Updates

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రం ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో (ఎస్ఆర్డీపీ) భాగంగా జీహెచ్​ఎంసీ ఈ ఫ్లైఓవర్ ను నిర్మించింది. వనస్థలిపురం-దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ కూడలి వద్ద ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు/హయత్‌నగర్‌ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా (సిగ్నల్ ఫ్రీ) వెళ్లొచ్చు. 760 మీ పొడవు, 12మీ వెడల్పుతో 3-లేన్ తో కూడిన ఈ ఫ్లై ఓవర్ ను రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తాకు తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో అమ‌రుడైన శ్రీకాంతాచారి పేరును నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పటివరకు ఎస్ఆర్డీపీ కింద ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 12 ప‌నుల‌ను రూ. 650 కోట్ల‌తో చేప‌ట్టామ‌ని చెప్పారు. ఎల్బీన‌గ‌ర్ పరిధిలో ఈ ఫ్లైఓవ‌ర్ 9వ ప్రాజెక్టు అని, ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయన్నారు. బైరామ‌ల్‌గూడ‌లో సెకండ్ లెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్, రెండు లూప్‌ల‌ను సెప్టెంబ‌ర్ నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈరోజు ప్రారంభించుకున్న ఫ్లైఓవ‌ర్‌కు మాల్ మైస‌మ్మ అని నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్త‌ర్వుల‌ను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 11 =