అంశాల స్వామి ఇంటికి వెళ్లి భోజనం చేసిన మంత్రి కేటీఆర్, భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని హామీ

Minister KTR Visits Fluoride Victim Amshala Swamy House at Munugode Had Lunch with Family Members, Minister KTR Visits Fluoride Victim Amshala Swamy, KTR Visits Fluoride Victim , Amshala Swamy House at Munugode, KTR Lunch with Amshala Swamy Family Members, Amshala Swamy House, Minister KTR, Minister KTR Latest News And Updates, Minister KTR Visits Fluoride Victim Amshala Swamy, Fluoride Victim Amshala Swamy, Amshala Swamy Fluoride Victim , Fluoride Victim Amshala Swamy, KTR TRS Party Working President, TRS Party

మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్ సందర్భంగా గురువారం చండూరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ర్యాలీ అనంతరం మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. గతంలో అంశాల స్వామి మంత్రి కేటీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కలవగా, ఆయన పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. అలాగే ప్రభుత్వం త‌ర‌పున‌ అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి, ఐదున్నర లక్షలు మంజూరు చేయించారు. అలాగే మిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ చేయించి పూర్తి చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు.

ఈ నేపథ్యంలో మునుగోడులో కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తయిన అనంతరం నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా వచ్చారు. ఈ సందర్భంగా అంశాల స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి అంశాల స్వామి ఇంట్లో మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. అంశాల స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం, ఆయన హెయిర్ కటింగ్ సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకుని, స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ కూడా అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =