యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి తలసాని

Minister Ta Mango News, Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav Visits Yadadri, Minister Talasani Srinivas Yadav Visits Yadadri Temple, Minister Talasani Srinivas Yadav Visits Yadadri Temple Today, talasani srinivas yadav, Talasani Srinivas Yadav Visits Yadadri, Talasani Srinivas Yadav Visits Yadadri Temple, Yadadri Temple Construction, Yadadri Temple Construction News, Yadadri Temple Development Works, Yadadri temple news, Yadadri Temple Renovation Workslasani Srinivas Yadav Visits Yadadri Temple Today

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ముందుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదాద్రిని దర్శించుకోవడానికి రావటంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం యాదాద్రి ఆలయ పనుల పురోగతిని ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం లో మంత్రి తలసాని మాట్లాడుతూ, యాదాద్రి అద్భుత కళాఖండం అవుతుందన్నారు. తిరుపతి దేవాలయంలా యాదాద్రిలో ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని సౌకర్యాలతో గుడి నిర్మాణం జరుగుతుందని అన్నారు.

ఇక హుజురాబాద్ ఉపఎన్నికలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. యువకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. తెలంగాణలో 2014 కన్నా ముందు ఉన్న సమస్యలు తరువాత లేదన్నారు. తాగడానికి మంచి నీరు అందుతుంది, కరెంటు కొరత లేదు. సాగు నీరు కోసం రెండు పంటలు రైతులు పండించుకోగలుగుతున్నారన్నారు. ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మీ పథకం కింద ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదని, ఏ రాష్ట్రంలో ఇవ్వటం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందుతున్నాయన్నారు. వాసాలమర్రి మరికొన్ని రోజుల్లో అద్భుతమైన గ్రామం అవుతుందని మంత్రి చెప్పారు. దళిత బంధు వాసాలమర్రిలో లాంఛనంగా ప్రారంభించారు. ఇక హుజురాబాద్ లో అమలు కానుందన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారని, వ్యాక్సిన్ విషయంలో సహకరించడం లేదని మంత్రి తలసాని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 19 =