కేటీఆర్‌కు ప్లస్ పాయింట్.. బీజేపీలో భగ్గుమంటున్న అసంతృప్తి

Plus point for KTR Discontent in BJP,Plus point for KTR,KTR Discontent in BJP,sircilla, bjp, rani rudrama, brs, ktr,Mango News,Mango News Telugu,KTR Discontent in BJP Latest News,KTR Discontent in BJP Latest Updates,KTR Discontent in BJP Live News,sircilla Latest News,sircilla Latest Updates,BJP Latest News,BJP Latest Updates,Telangana News,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana News Today
sircilla, bjp, rani rudrama, brs, ktr

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు మంత్రి కేటీఆర్. తనదైన మార్క్‌తో ఆ ప్రాంతంలో దూసుకెళ్లారు. ఇప్పుడు మరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నాలుగోసారి గెలుపే లక్ష్యంగా కేటీఆర్ పావులు కదుపుతున్నారు. అయితే కేటీఆర్‌ను ఎదుర్కొనేందుకు.. బీజేపీ రాణి రుద్రమను రంగంలోకి దింపింది. ఈసారి ఎలాగైనా కేటీఆర్‌ను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ బీజేపీ ప్రయత్నాలన్నీ బూడిదల పోసిన పన్నీరే అవుతున్నాయి.

కేటీఆర్ 2009లో సిరిసిల్ల నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో తనదైన మార్క్ చూపించారు. ఆ తర్వాత 2014, 2018లో బీఆర్ఎస్ తరుపున పోటి చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2009 కంటే ముందు సిరిసిల్ల ప్రాంతం కరువు, ఆకలి చావులతో అలమటించిపోయింది. చాలా మంది ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పట్టించుకునే నాథుడే కరువైపోయారు. కేటీఆర్ ఎంట్రీ ఇచ్చాక ఆ ప్రాంత రూప రేఖలే మారిపోయాయి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా సిరిసిల్లను కేటీఆర్ మార్చేశారు.

2009 నుంచి కేటీఆర్ సిరిసిల్లలో పాతుకుపోయారు. గత ఎన్నికల్లో కేటీఆర్‌ను ఓడించేందుకు స్థానిక నేతలు ప్రయత్నించినప్పటికీ ఓడించలేకపోయారు. అతన్ని ఓడించడం స్థానికుల వల్లే కాలేదు. అటువంటిది ఆయన్ను ఓడించేందుకు బీజేపీ స్థానికేతరురాలైన రాణి రుద్రమను బరిలోకి దింపింది. అయితే అక్కడి బీజేపీ నేతలంతా స్థానికులకే టికెట్ దక్కుతుందని భావించారు. సిరిసిల్లలో బీజేపీ కేడర్ కూడా గట్టిగానే ఉంది. ఈసారి ఎలాగైన కేటీఆర్‌కు గట్టి పోటీ ఇవ్వాలని సిద్ధమయ్యారు. కానీ అధిష్టానం స్థానికులను పక్కన పెట్టేసి.. రాణి రుద్రమకు టికెట్ ఇచ్చింది.

దీంతో స్థానిక నేతలంతా అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నారు. అసంతృప్తులు అధిష్టానంపై భగ్గుమంటున్నారు. కొందరు పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. మరికొందరు బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మరికొందరు అధిష్టానాన్ని నిలదీసే పనిలో పడ్డారు. స్థానికేతరురాలికి టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రచారానికి కూడా సహకరించడం లేదు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ, అసంతృప్తులు భగ్గుమంటున్నప్పటికీ.. అధిష్టానం మాత్రమే పట్టించుకోవడంలేదు. సైలెంట్‌గా చూస్తూ ఉంటోంది.

ఇలా సిరిసిల్ల బీజేపీలో అసంతృప్తి భగ్గుమనడం.. కేటీఆర్‌కు ప్లస్ పాయింట్ అయింది. ఆయనకు అసలు పోటీ లేకుండా పోయింది. అటు కేటీఆర్‌ను ఓడించాలని పావులు కదుపుతున్న బీజేపీకి ఇది పెద్ద దెబ్బ అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి బీజేపీకి అక్కడ కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eleven =