హైదరాబాద్‌లో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ దీక్ష.. పాల్గొన్న బండి సంజయ్ సహా పలువురు నేతలు

Telangana BJP Chief Bandi Sanjay and Other Leaders Participated in Mahila Gosa-BJP Bharosa Deeksha in Hyderabad Today,Telangana BJP Chief Bandi Sanjay,Mahila Gosa-BJP Bharosa Deeksha,BJP Bharosa Deeksha in Hyderabad Today,BJP Chief and Other Leaders in Deeksha,Mango News,Mango News Telugu,Bandi Sanjay Deeksha,Mahila Gosa-BJP Bharosa,BJP counter protest in Hyd,Mahila Gosa-BJP Bharosa Latest News,Telangana Latest News,Telangana News Today

తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని, ప్రగతి భవన్‌లో అని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మూడుసార్లు.. 1998, 1999, 2002లో మూడుసార్లు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిందని, అయితే నాడు ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని తెలియజేశారు. ఇక తెలంగాణ కేబినెట్‌లో 3శాతం మంది కూడా మహిళా మంత్రులు లేరని, అలాంటిది ఆ పార్టీ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా.. లిక్కర్ స్కాం నుంచి తప్పించుకోలేరని, త్వరలోనే ఆమె జైలుకు పోవడం ఖాయమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఇక ఈ సందర్భంగా ఇతర బీజేపీ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, లిక్కర్ కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బెల్టు షాపుల దందాపై ఆందోళన వ్యక్తం చేసిన మహిళా మోర్చా, మహిళపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసి మహిళలకు సాధికారిత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యనేతలు సహా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే మరోవైపు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఎమ్మెల్సీ శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా ఈరోజు నిరసన దీక్ష చేపట్టిన నేపథ్యంలోనే.. బీజేపీ నేతలు ఇక్కడ హైదరాబాద్‌లో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేయడం ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fourteen =