సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ సమావేశంలో నిర్ణయం

Telangana Assembly Session will Held on September 12th 13th Decided in BAC Meeting, Telangana Assembly Sessions, BAC Meeting, Telangana Assembly Session Started Today, Assembly Session Adjourned To Sep 12th, Telangana Assembly Sessions, Mango News, Mango News Telugu, Telangana Assembly Session, Telangana Assembly Session Postponed, Telangana Assembly, Telangana Assembly Session Resumes On Sep 12th, Telangana Assembly News And Live Updates

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 6, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు మరియు సెప్టెంబర్ 12, 13 తేదీలతో కలిపి మొత్తం మూడు రోజుల పాటుగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం ఉదయం 11.30 గంట‌ల‌కు శాసనసభ సమావేశాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. శాసనసభకు సీఎం కేసీఆర్‌, రాష్ట్రమంత్రులతో పాటు సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా ముందుగా ఇటీవల మరణించిన తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాల అనంతరం సభను వచ్చే సోమవారం (సెప్టెంబర్ 12వ తేదీ) ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తునట్టుగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

అనంతరం సమావేశాల నిర్వహణపై అసెంబ్లీలో బీఏసీ(శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల స‌ల‌హా సంఘం) సమావేశం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. ఈ బీఏసీ సమావేశం సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్, మజ్లిస్‌ పార్టీలు కోరగా గణేష్ నిమజ్జనాలు, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకల నేపథ్యంలో సభను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోతున్నట్టు మంత్రులు తెలిపారు. పని దినాలు తగ్గినా కూడా ఎక్కువ సమయం సభ నడుపనున్నట్టు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి సహా పలు బిల్లులు, తీర్మానాలను 12, 13 వ తేదీల్లో జరిగే సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + three =