ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక

2021 MLC Elections, 2021 MLC Elections in Telangana, 6 MLA Quota MLC Elections In Telangana, 6 TRS Candidates Elected Unanimously, Kavitha 11 others named as MLC candidates, Mango News, MLA Quota MLC Elections, MLA Quota MLC Elections in Telangana, Six MLC nominees from TRS elected unanimously, Six TRS candidates elected unanimously as MLCs, Telangana MLA Quota MLC Elections, Telangana MLC Elections, TRS Candidates Elected Unanimously

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ (టీఆర్ఎస్) అభ్యర్థులగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, బండ ప్రకాష్ నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ఈ ఆరుగురితో పాటుగా మరో ఇద్దరు స్వతంత్ర అభ్య‌ర్థుల నామి‌నే‌ష‌న్లు దాఖలు చేశారు. అయితే పరిశీలన అనంతరం స్వతంత్ర అభ్య‌ర్థుల నామి‌నే‌ష‌న్లను ఎన్ని‌కల రిట‌ర్నింగ్‌ అధి‌కారి తిర‌స్క‌రిం‌చారు.

దీంతో ఎలాంటి పోటీ లేకపోవడంతో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + seven =