ఏప్రిల్ 19న తెలంగాణ కేబినెట్ భేటీ

Coronavirus, COVID-19, India COVID 19 Cases, KCR Cabinet Meeting, telangana, Telangana Cabinet, Telangana Cabinet Meet, Telangana Cabinet Meeting, telangana cabinet news, Telangana Cabinet On Lockdown Relaxations, Telangana Cabinet To Discuss Corona, Telangana CM KCR, Telangana CM KCR Cabinet Meeting, Telangana Lockdown Relaxations

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్ ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశంపై ఈ కేబినెట్ భేటీలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

ఏప్రిల్ 15, బుధవారం నాడు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిథిగా లాక్‌డౌన్ అమలవుతుంది, తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటిలాగానే సహకరించాలని చెప్పారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650కి పెరిగింది. బుధవారం నాడు మరో ఆరుగురికి కొత్తగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 650 మందిలో 118 మంది వైరస్ లక్షణాల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, 18 మంది మరణించారు. ప్రస్తుతం 514 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − six =