ఉస్మానియా ఆసుపత్రిలో పాత భవనాన్ని ఖాళీ చేసి సీజ్ చేయండి – డీఎంఈ

Telangana DME has Directed Officials to Vacate and Close Old building of Osmania Hospital

ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేసి సీజ్‌ చేయాలనీ జూలై 22, బుధవారం నాడు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాలు జారీ చేశారు. పాత భవనంలోని విభాగాలను ఖాళీ చేసి, రోగులను ఇతర వార్డుల్లోకి తరలించాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను డీఎంఈ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం 6 వార్డులు మరియు 2 ఆపరేషన్ థియేటర్లను కొత్త భవనాల్లోకి మార్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవలే ఉస్మానియా ఆసుపత్రి పాత భవనంలోని గదుల్లోకి వర్షపు నీరు చేరడంతో పెద్దఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతభవనంలో పేషేంట్లను, పరికరాలను ఇతర వార్డుల్లోకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =