కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో సమావేశాలపై ఆంక్షలు

Telangana Govt Issues New Restrictions on Gatherings in the State,Covid-19,Coronavirus,Covid-19 In Telangana,Telangana,Telangana News,New COVID Restrictions in Telangana,COVID restrictions in Telangana,Telangana New COVID Restrictions,Telangana govt extends night curfew,Telangana Issues Guidelines For Marriages,Telangana Govt Imposes Strict Covid Restrictions,Covid-19 Telangana,Telangana Govt Imposes Restrictions,Guidelines For Marriages And Funerals In Telangana,Telangana Govt Issues Fresh Guidelines,Telangana Govt Issues New Guidelines For Social Gatherings,Telangana Govt Imposes More Covid Restrictions,Covid News,Telangana COVID Restrictions

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఆంక్షలు/పరిమితులను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఆంక్షలివే:

  • వివాహాలు, సంబంధిత కార్యక్రమాలకు 100 మంది మించకూడదు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం సహా అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి.
  • అంత్యక్రియలు, సంబంధిత కార్యక్రమాలకు 20 మంది మించకూడదు.
  • అన్ని సామాజిక/రాజకీయ/ క్రీడా/ వినోద/విద్యా/మతపరమైన/సాంస్కృతిక సమావేశాలు లేదా కార్యక్రమాలపై నిషేధం విధింపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 1 =