సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Cinema Ticket Rates, Cinema Tickets Price, Govt Permit to Hike Cinema Ticket Rates in the State, Mango News, Telangana Cinema Tickets Price, Telangana Govt, Telangana Govt Permit, Telangana Govt Permit to Hike Cinema Ticket Rates, Telangana Govt Permit to Hike Cinema Ticket Rates in the State, Telangana High Court, Ticket Prices, Ticket Rates, TS High Court

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీరంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు చేసింది. కరోనా పరిస్థితుల అనంతరం టికెట్ల ధర పెంపుపై ప్రభుత్వానికి నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా కమిటీ సిఫార్సులను పరిశీలించి టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్స్ లో రూ.5, నాన్-ఏసీ థియేటర్స్ లలో రూ.3 వసూలు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ల ధరలుపెంపుపై తమ విజ్ఞప్తి పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు అనుమతి వివరాలివే:

మినిమమ్ :

  • ఏసీ థియేటర్స్/ఎయిర్ కూల్డ్ : రూ.50 + జీఎస్టీ
  • నాన్-ఏసీ థియేటర్స్ : రూ.30 + జీఎస్టీ
  • మల్టిఫ్లెక్స్ లు : రూ.100 + జీఎస్టీ

మాక్సిమమ్ :

  • ఏసీ థియేటర్స్/ఎయిర్ కూల్డ్ : రూ.150 + జీఎస్టీ
  • నాన్-ఏసీ థియేటర్స్ : రూ.70 + జీఎస్టీ
  • సింగిల్ థియేటర్స్ లో రిక్లైనర్ సీట్స్ : రూ.200 + జీఎస్టీ
  • స్పెషల్ ఐమాక్స్/ లార్జ్ స్క్రీన్స్ : రూ.250 + జీఎస్టీ
  • మల్టిఫ్లెక్స్ లు : రూ.250 + జీఎస్టీ
  • మల్టిఫ్లెక్స్ లలో రిక్లైనర్ సీట్స్ : రూ.300 + జీఎస్టీ

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =