ఆగస్టు 20 నుంచి తెలంగాణలో డిజిటల్ క్లాసులు ప్రారంభం

EAMCET, Eamcet Exams Date 2020, Eamcet on September Second Week, Telangana Eamcet Exam, Telangana Eamcet Exam Updates, Telangana Govt Proposes to Conduct Eamcet, TS Eamcet 2020

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహణ, విద్యా సంవత్సరం అమలుపై విధివిధానాలను రూపొందించేందుకు ఆగస్టు 10, సోమవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డితో ఆమె చర్చించారు. ఈ-సెట్‌ ను ఆగస్టు 31న, పాలిసెట్‌ సెప్టెంబర్‌ 2న నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 9,10,11,14వ తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే హైకోర్టు అనుమతితో ఎంసెట్‌ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుందని చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు ఆగస్టు 20 నుంచి విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా క్లాసులు బోధించనున్నారు. సెప్టెంబర్‌ 1 న 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ఆగస్టు 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించి, సెప్టెంబర్‌ 1 తరువాత ఇంటర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వనున్నట్టు మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =