ప్రాన్స్ అధ్యక్షుడుగా రెండోసారి ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ విజయం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

PM Narendra Modi Congratulates Emmanuel Macron on being Re-elected as France President, Emmanuel Macron on being Re-elected as France President, PM Modi Congratulates French President Emmanuel Macron On Re Election, Modi Congratulates French President Emmanuel Macron On Re Election, Prime Minister Narendra Modi congratulated French President Emmanuel Macron on his re-election, French President Emmanuel Macron, President Emmanuel Macron, French President, Emmanuel Macron, President of France, President of France Emmanuel Macron, French re-election, Prime Minister Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Mango News, Mango News Telugu,

ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రాన్స్ అధ్యక్షుడుగా ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌ పై ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఘన విజయం సాధించారు. మాక్రాన్ కు 58.6 శాతం ఓట్లు రాగా, మరీన్‌ లీపెన్‌ కు 41.4 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రాన్స్ అధ్యక్షుడుగా రెండోసారి విజయం సాధించిన మాక్రాన్‌ కు పలు ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాక్రాన్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ అభినందనలు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు కలిసి పనిచేయడం కొనసాగించాలని నేను ఎదురుచూస్తున్నాను” ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఎన్నికల్లో విజయం అనంతరం మాక్రాన్ మాట్లాడుతూ, “5 సంవత్సరాల్లో మార్పులు, సంతోషకరమైన మరియు కష్ట సమయాలు, అసాధారణమైన సంక్షోభాల తర్వాత కూడా రాబోయే 5 సంవత్సరాల పాటు ఫ్రాన్స్ కు అధ్యక్షత వహించడానికి నాపై నమ్మకం ఉంచిన ఫ్రెంచ్ పురుషులు మరియు మహిళలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రాన్స్‌ను గొప్ప పర్యావరణ దేశంగా మార్చడం మా ప్రాజెక్ట్. ఈ దేశంలో చాలా మంది నాకు ఓటు వేశారు, వారు నా ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికే కాదు, కానీ ఫార్-రైట్‌ల నుండి దూరంగా ఉంచడం కోసం. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మరియు రాబోయే సంవత్సరాల్లో వారికి రుణపడి ఉంటాను”అని అన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 7 =