బయో ఆసియా-2023 సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్, హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు నిర్వహణ

Telangana IT and Industries Minister KTR Inaugurates 20th Edition of BioAsia Conference at HICC, Telangana IT and Industries Minister KTR, BioAsia Conference at HICC, KTR Inaugurates 20th Edition of BioAsia Conference, 20th Edition HICC, Mango News, Mango News Telugu, Telangana Minister Ktr Tweet,Trs Minister Ktr, Bioasia Summit 2023,Bioasia 2023 Registration,Bioasia 2023 Agenda,Bioasia 2023 India,Bio Asia Hyderabad,Bioasia 2023 Website,Bio Asia Summit 2023 Theme,Bio Asia Summit 2023 Held In,Bio Asia Conference 2023,Bioasia Conference,Bio Asia International Conference 2023,Bio Asia International Conference

హైదరాబాద్ నగరం వేదికగా నేటి నుండి బ‌యో ఆసియా-2023 స‌ద‌స్సు ప్రారంభమైంది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో శుక్రవారం ఉదయం 10 గంటలకు బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2023 (20వ ఎడిషన్) ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ అతిపెద్ద లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్‌టెక్ ఈవెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. బయో ఆసియా సదస్సు-2023 యొక్క థీమ్ ను ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌-షేపింగ్‌ ది నెక్స్‌ జనరేషన్‌ ఆఫ్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’ గా నిర్ణయించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పలు సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. బ‌యో ఆసియా-2023 స‌ద‌స్సు ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ స్వాగతోపన్యాసం చేసి, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ ఎదుగుతున్న విధానం, అనుకూల విధానాలు, ప్రభుత్వం సహకారం, ఇప్పటికే ఏర్పడిన సంస్థలు, జీనోమ్ వ్యాలీ ప్రత్యేకతలు సహా పలు అంశాల గురించి వివరించారు.

హెచ్‌ఐసీసీలో ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 26 వరకు మూడు రోజుల పాటుగా జరగనున్న బయో ఆసియా-2023 సదస్సులో ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల లీడర్స్, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచంలోని పలుదేశాల నుంచి జీవ‌శాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొని ఫార్మా, ఆరోగ్య రంగాల అభివృద్ధి, పరిశోధనలపై ప్రసంగాలు చేయడంతో పాటుగా చర్చించనున్నారు. 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు కానున్నట్టు తెలుస్తుంది. అలాగే బయోటెక్‌, లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో పలు స్టార్టప్ లు తమ ఉత్పత్తులు ప్రదర్శించనున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పార్మా రంగంపై నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌ కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఇక సాయంత్రం 5.45 గంటలకు ఈ ఏడాది జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెంట్‌ పురస్కారాన్ని జీవశాస్త్రంలో విశేష కృషికి గానూ ఆచార్య రాబర్ట్‌ లాంగర్‌ కు ప్రదానం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =