టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ముగ్గురు నిందితులను నాంపల్లి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించిన ‘సిట్’

TRS MLAs Poaching Case SIT Shifts Three Accused To Nampally FSL For Voice Recording,TRS MLAs Poaching Case,Telangana High Court,Lifts Stay Orders,Moinabad Farm House,Moinabad Farm House Case,Mango News,Mango News Telugu,TRS MLAs Poaching Case,Telangana HC Lifts Stay on Probe,MLAs poaching case,TRS MLAs Purchasing Issue, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణను ‘సిట్’ వేగవంతం చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ గురువారం ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజేంద్రనగర్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి తరలించి విచారించారు. ఏసీబీ కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు దాదాపు 40కి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మొదట విడివిడిగా ప్రశ్నించిన సిట్ అధికారులు అనంతరం ముగ్గురిని కలిపి ఒకేచోట కూర్చోబెట్టి మరలా ప్రశ్నించారు.

అయితే ఈ ప్రశ్నలలో కొన్నింటికి ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం ఇవ్వడంపై అధికారులు దృష్టి సారించారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిందితులు జరిపిన సంభాషణల ఆధారంగా వారి నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం నేడు కూడా వారిని విచారించనున్నారు. మొదటి రోజు విచారణ ముగిసిన తర్వాత సాయంత్రం 5. 30 గంటలకు ముగ్గురిని తిరిగి జైలుకు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం చంచల్‌గూడలో జైలులో ఉన్న వీరిని మరోసారి పోలీసులు రెండో రోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఈ ముగ్గురిని నేరుగా నాంపల్లిలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించారు. అక్కడ వారికి వాయిస్‌ రికార్డు నిర్వహించనున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా జరిపిన బేరసారాలలో రికార్డు అయిన ఆడియో, వీడియోల వాయిస్‌తో దీనిని సరిపోల్చనున్నారు. దీంతో ఈ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కీలకం కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 7 =