తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే?

CEO Vikas Raj says Telangana has 29580736 Voters now Age Group of 18 to 19 Stands at 83207,CEO Vikas Raj,Telangana has 29580736 Voters,Age Group of 18 to 19 Stands,Mango News,Mango News Telugu,Telangana Voter Strength,Telangana Has 2.95 Crore Voters,CEO-Telangana,CEO Telangana,Poll Arrangements,Telangana Assembly Electins, Telangana Latest News And Updates,Telangana Voters,Voters in Telangna,Voting in Telangana

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అర్హులైన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. తెలంగాణ ఓటర్ డ్రాఫ్ట్ స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)-2023 బుధవారం ప్రచురించబడింది. ఈ నేపథ్యంలో ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3,45,648 మంది ఓటు హక్కు పొందినట్టు ప్రకటించారు. అలాగే 11,36,873 మంది ఓటర్లను తొలగించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో 18 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 83,207 మంది ఉన్నారని చెప్పారు. ఇక ఓటర్ల తొలగింపు విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారికి నిర్ణీత వ్యవధిలో 15 రోజులలోపు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే ఈ ఎస్ఎస్ఆర్ సమయంలో జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలతో వారానికోసారి సమావేశాలు నిర్వహించి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీకరించిన ఫారమ్స్ మరియు వాటిపై తీసుకున్న చర్యల వివరాలను తెలియజేయాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు ఇచ్చారు.

తెలంగాణ తాజా ఓటర్ల జాబితా వివరాలు:

  • రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య : 119
  • మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంఖ్య : 34,891
  • రాష్ట్రంలో మొత్తం ఓటర్లు సంఖ్య : 2,95,80,736
  • పురుష ఓటర్లు సంఖ్య : 1,48,58,887
  • మహిళా ఓటర్లు సంఖ్య : 1,47,02,391
  • థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య : 1,654
  • కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య : 3,45,648
  • సర్వీస్ ఓటర్ల సంఖ్య : 15,067
  • ఎన్ఆర్ఐ ఓటర్లు : 2,737
  • తొలగించిన ఓటర్ల సంఖ్య : 11,36,873.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + seven =