ఆంధ్రాలో ‘ఉర్దూ’ను రెండవ భాషగా గుర్తిస్తూ చట్టసవరణ.. ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

AP Cabinet Approves Amendment of Recognizing Urdu As Second Language in Andhra Pradesh, AP Cabinet Approves Amendment of Recognizing Urdu As Second Language in AP, AP Cabinet Approves Amendment of Recognizing Urdu As Second Language, Urdu As Second Language in Andhra Pradesh, Urdu As Second Language, Urdu, Second Language, AP Cabinet, AP Cabinet Latest News, AP Cabinet Latest Updates, AP Cabinet Live Updates, Andhra Pradesh, AP, AP Second Language As Urdu, Manog News, Manog News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఉర్దూ’ భాషను రెండవ భాషగా గుర్తిస్తూ చట్టసవరణ చేశారు. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం ఏపీ అధికార భాషా చట్టం 1966కు ముఖ్య సవరణ చేశారు. ఈరోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో మొత్తం 35 అజెండా అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న కొత్త జిల్లాల ప్రకటనపై వచ్చిన అభ్యంతరాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ముఖ్యంమత్రి జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. మొదటగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి వర్గం 2 నిముషాలు మౌనం పాటించింది.

ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలలో ముఖ్యమైనవి ఇవే..
  • ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణ చేయటం – ఉర్దూకు రెండవ భాషగా గుర్తింపు
  • ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం
  • రాష్ట్రంలోని ముఖ్యమైన పోర్టుల నిర్మాణాలకై రుణ సమీకరణ కోసం మారిటైమ్ బోర్డుకు హామీ
  • విదేశీ మద్యం నియంత్రణ కోసం చట్ట సవరణ
  • టీటీడీలో ప్రత్యేక నియామకాలకై హిందు ధార్మిక సంస్థల చట్టానికి సవరణ
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 1 =