నవరత్నాల అమలుకు క్యాలెండర్, ఈబీసీ నేస్తం పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

2021 AP Cabinet Meeting, Andhra Pradesh Cabinet Meeting Highlights, Andhra Pradesh cabinet meeting News, Andhra Pradesh Latest News, AP Cabinet, AP Cabinet Approves EBC Nestam Scheme, AP Cabinet Meet, AP Cabinet Meeting, AP Cabinet Meeting 2021, AP Cabinet Meeting Today Highlights, AP Cabinet Meeting Today News, AP Cabinet Meeting Updates, AP Secretariat, CM YS Jagan, EBC Nestam Scheme, Mango News, Panchayat Election Results, privatisation of Vizag Steel Plant, VSP Privatisation, YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • ఈబీసీ నేస్తం పథకానికి రూ.670 కోట్లతో కేబినెట్ ఆమోదం. అగ్రవర్ణాల్లో ఆర్ధిక వెనుకబాటు కలిగిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు 2021-22 నుంచి 15 వేలు చొప్పున మూడేళ్ల పాటుగా 45 వేలు రూపాయలను ఈ పథకం కింద అందించనున్నారు.
  • ఇప్పటివరకు నవరత్నాలు సహా ప్రజలకు అందజేసిన 23 పథకాలకు సంబంధించి ఈ ఏడాది క్యాలెండర్‌ కు (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ క్యాలెండర్ కు అనుగుణంగా అమలు పరిచే పథకాల ద్వారా సుమారు 8 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు జరగనుందని చెప్పారు.
  • పట్టణ ప్రాంతాల్లో 300 చదరపు అడుగులలోపు ఉండే ఇళ్లు/అపార్టుమెంట్లను 1,43,600 మందికి రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి త్వరలో అప్పజెప్పేందుకు నిర్ణయం.
  • కొత్తగా ఏప్రిల్ 2021 నుంచి వచ్చే ప్రైవేట్ లేఔట్ల అన్నింటిలో 5 శాతం భూమి పేదవర్గాలకు కేటాయించేలా ప్రభుత్వానికి బదలాయించేందుకు చట్టసవరణకు కేబినెట్ ఆమోదం.
  • రైతుభరోసా కేంద్రాలకు అనుసంధానంగా మల్టీ పర్ఫస్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు.
  • చిత్తూరు జిల్లాలో పెనుమూరు, కార్వేటి లలో పీహెఛ్సీ లను 50 పడకల ఆసుపత్రులుగా అప్‌గ్రేడేషన్.
  • రాజధాని అమరావతి పరిధిలో ఉన్న అసంపూర్తి భవనాల నిర్మాణాలు పూర్తి చేసునేందుకు అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ) కు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
  • విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం.
  • ఏపీ గేమింగ్‌ యాక్టు –1974 సవరణకు‌ ఆమోదం.
  • వైఎస్ఆర్ కడప‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి జాయింట్‌ వెంచర్‌ ఎంపిక ప్రక్రియకు కేబినెట్‌ ఆమోదం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =