చీపురుపల్లి వైసీపీ టికెట్ ఆ ఇద్దరిలో ఎవరికి..?

Chipurupalli YCP Ticket To Which Of The Two, Chipurupalli YCP Ticket, YCP Ticket Chipurupalli, Which Of The Two Chipurupalli YCP Ticket, Chipurupalli, Botsa Satyanarayana, YCP, AP Politics, AP Assembly Elections, Chipurupalli Majji Srinivasarao, Latest Chipurupalli YCP Ticket News, Chipurupalli YCP Ticket News, YCP Tickets News, Political News, Mango News, Mango News Telugu
Botsa satyanarayana, YCP, AP Politics, AP Assembly elections, Chipurupalli. Majji srinivasarao

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ పార్టీ కొందరు సిట్టింగ్‌లను పక్కనపెట్టి.. కొత్తవారికి అవకాశంమిచ్చే పనిలో తలామునకలవుతోంది. ఇక ఏపీలో వైసీపీకి కంచుకోట విజయనగరం జిల్లా. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్‌గా.. జిల్లా పరిషత్ చైర్మన్‌గా మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు.

విజయనగరం జిల్లాలో వైసీపీ బలోపేతానికి మజ్జి శ్రీనివాసరావు ఎంతో కష్టపడ్డారు. విజయనగరంలో ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉంది. నిజానికి 2019 ఎన్నికల్లోనే శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ భావించింది. కానీ చివరి నిమిషంలో ఆయనకు కాకుండా మరొకరికి టికెట్ దక్కింది. అయితే విజయనగరం జిల్లాపై మంచి పట్టు ఉన్న శ్రీనివాసరావుకు ఈసారి టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. అటు శ్రీనివాసరావు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.

అయితే ఒకవేళ మజ్జి శ్రీనివాసరావుకు టికెట్ ఇస్తే విజయనగరంలో ఏ స్థానం నుంచి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అటు మంత్రి బొత్స సత్యనారాయణను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా.. విజయనగరం నుంచి లోక్ సభ ఎన్నికలకు పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. బొత్స సత్యనారాయణ ఎంపీగా పోటీలో ఉంటే.. ఆ పార్లమెంట్‌ పరిధిలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను సులువుగా గెలుచుకోవచ్చని అధిష్టానం చూస్తోంది. అటు బొత్స కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగానే ఉన్నారట.

ఈక్రమంలో బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి నుంచి మజ్జి శ్రీనివాసరావును బరిలోకి దింపాలని అధిష్టానం చూస్తోందట. అటు బొత్స సత్యనారాయణ మాత్రం తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి నుంచి తన కుమారుడు బొత్స సందీప్‌ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్నారట. అయితే మజ్జి శ్రీనివాసరావు అనుభవజ్ఞుడు కావడంతో అధిష్టానం ఆయనకే చీపురుపల్లి టికెట్ ఇవ్వాలని భావిస్తోందట. ఈక్రమంలో చీపురుపల్లి టికెట్ బొత్స కొడుక్కి దక్కుతుందా..? లేక అల్లుడికి దక్కుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eight =