కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం వైఎస్ జగన్‌ భేటీ

AP CM YS Jagan Meets Union Jal Shakti Minister Gajendra Singh Shekhawat,CM Jagan Meets Jal Shakti Minister Shekhawat,CM Jagan Asks To Consider Revised Cost Estimates Of Polavaram,Mango News,Mango News Telugu,CM Jagan To Meet Gajendra Singh Shekhawat,AP CM To Discuss On Polavaram Project,Gajendra Singh Shekhawat,Jal Shakti Minister Gajendra Singh Shekhawat,Union Minister Gajendra Singh Shekhawat,Ys Jagan Meets Jalshakthi Minister Gajendra Singh Shekhawat,Central Minister Gajendra Singh Shekhawat,Central Irrigation Minister Gajendra Singh Shekhawat,Gajendra Singh Shekhawath,CM Jagan Meets Gajendra Singh Shekhawat,Gajendra Singh,AP CM YS Jagan Meets Union Jal Shakti Minister,AP CM YS Jagan,CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ‌ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కు సవరించిన అంచనాలను ఆమోదించాలని, ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి తగిన సాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకయ్యే ఖర్చును కూడా రీయింబర్స్‌ చేయాలని సీఎం కోరినట్టుగా సమాచారం.

మరోవైపు ఈ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాతో ప్రత్యేక హోదా, కర్నూలుకు హైకోర్టు తరలింపు, పోలవరం ప్రాజెక్టు కోసం అయ్యే రూ.55,656 కోట్ల వ్యయానికి ఆమోదం, స్థానిక సంస్థలు, సబ్సిడీ బియ్యం బకాయిలు, రాష్ట్రంలో 16 వైద్య కళాశాలల స్థాపనకు అనుమతులు, నివర్ తుఫాన్ నష్టం, మూడు రాజధానులకు మద్దతు వంటి అంశాలపై గంటకుపైగా సీఎం వైఎస్ జగన్ చర్చించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ రోజు జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అనంతరం తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని సీఎం వైఎస్ జగన్ ఏపీకి తిరిగి ప్రయాణమయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + one =