రిజిస్ట్రేషన్లపై ఏర్పడ్డ అవరోధాలను అతి తొందర్లోనే అధిగమిస్తాం

Cabinet Sub-Committee On Non-Agricultural Properties Registrations Held Meeting Today,Cabinet Sub-Committee On Non Agricultural Properties Registrations Meeting,Non Agri Lands,Non Agriculture Lands Registration,Agriculture Lands Registration,Agri Lands Registration 2020,Mango News,Mango News Telugu,Cabinet Sub-Committee On Non-Agricultural Properties Registrations,Cabinet Sub-Committee,Non-Agricultural Properties Registrations,Cabinet Sub-Committee On Non-Agricultural Lands Registration,Cabinet Sub-Committee On Non Agri Lands Held Meeting Today,Non-Agricultural Properties Registrations Meeting Today,Cabinet Sub-Committee Meeting

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూములు రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం నాడు బిఆర్కే భవన్ లో భేటి అయింది. ఈ భేటీలో సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యులైన మున్సిపల్, ఐటి,ఇండస్ట్రీ శాఖ మంత్రి కెటి రామారావు,హోంమంత్రి మహమూద్ అలీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను సబ్ కమిటీ చైర్మన్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

అతి తొందరలోనే అవరోధాలు అధిగమిస్తాం:

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ “అన్ని క్రయవిక్రయాల దస్తావేజులు పారదర్శకంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందులోభాగంగా ఐదుగురు మంత్రులతో రిజిస్ట్రేషన్లపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ భేటి అయ్యింది. అవినీతికు ఆస్కారం లేకుండా ప్రజలు తమంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ధరణి పోర్టల్ ను సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. 100 రోజులు విరామంలో సీఎస్, అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారు. మంచి పోర్టల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చిన్న చిన్న అవరోధాలు అధిగమిస్తూ ముందుకు పోతున్నాం. సూచనలు, సలహాలు తీసుకుని అత్యంత సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నాం. ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి వస్తున్న సూచనలను క్రోడీకరిస్తున్నాం. అతి తొందరలోనే అవరోధాలు అధిగమిస్తాం” అని పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ ఆఫీసులను నాలుగు రకాలుగా వర్గీకరిస్తాం:

“ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులను నాలుగు రకాలుగా వర్గీకరిస్తాం. బాగా డిమాండ్ ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తక్కువ రిజిస్ట్రేషన్ అయ్యే కార్యాలయాలును గుర్తిస్తాం. పని లేని దగ్గర నుంచి పనిఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సబ్ రిజిస్ట్రార్ లను, ఆపరేటర్ లను మారుస్తాం. పెండింగ్ లో ఉన్న డాక్యుమెంట్లు పూర్తి చేస్తాం. ఇప్పుడు ఇస్తున్న డాక్యుమెంట్ పేపర్లు విషయంలో బ్యాంకర్లు అపోహలకు పోవద్దు. డిజిపీఏ ప్రొవిజన్ ను రేపు లేదా ఎల్లుండి ఇంట్రడ్యూజ్ చేస్తాం. జిపీఏ, ఎస్పీఏ, మార్టిగేట్ లను తొందరలోనే అందుబాటులో తెస్తాం. ఈ నెల 17వ తేదీన స్టేక్ హోల్డర్స్ తో వర్క్ షాప్ నిర్వహిస్తాం” మంత్రి వెల్లడించారు.

“అలాగే అధికారులను మూడు గ్రూప్స్ గా విభజించాము. చట్ట పరమైన ఇబ్బందులకు ఒక బృందం, సాంకేతిక సమస్యలు మరో బృందం, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణకు మరో బృందం అధికారులు ఉంటారు. వారంలోగా సమస్యలను అధిగమిస్తాం. చిన్న చిన్న ఇబ్బందులను అన్నింటినీ దాటుకుని సౌలభ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తాం. ఓపెన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయి. టి-పిన్ నంబర్ అనేది యూనిక్ నంబర్. టి-పిన్ నంబర్ తప్పుడు రిజిస్ట్రేషన్లు కాకుండా, అవకతవకలు జరుగకుండా ఉండేందుకు తీసుకు వచ్చాము. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రజా సంక్షేమ ప్రభుత్వం, ప్రజలకు సులభతరంగా అందుబాటులో ఉండేవిధంగా పనిచేస్తుంది” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =