లోకేష్‌ను ఢీ కొట్టనున్న కమల..

Mangalagiri YCP candidate fix,Kamala, Lokesh,TDP candidate, Nara Lokesh, MLA, Alla Ramakrishna Reddy, Ganji Chiranjeevi from Mangalagiri,Candru Kamala,Tippala Devan Reddy,Vijaysai Reddy, AP Politics, AP Elections,Mango News Telugu, Mango News
Mangalagiri YCP candidate fix,Kamala, Lokesh,TDP candidate, Nara Lokesh, MLA, Alla Ramakrishna Reddy, Ganji Chiranjeevi from Mangalagiri,Candru Kamala

ఏపీలో మంగళగిరి వైసీపీ రాజకీయాలు మరింత వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి స్థానం..లో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను వైసీపీ అధిష్టానం నియమించినట్టు  తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని సమాచారం.

టీడీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి  నారా లోకేష్  పోటీలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి  స్థానంలో గంజి చిరంజీవిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో ఆళ్ల రామకృష్ణా రెడ్డి  వైసీపీకి  రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో దూసుకు పోతున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ పునరాలోచనలో పడ్డారు.

లోకేష్‌ను ఎలా ఓడించాలనే ఆలోచనతో ఉన్న జగన్..లోకోష్‌కు  కాండ్రు కమల దీటైన అభ్యర్ధి అవుతారని  భావిస్తున్నారు. దీంతోనే కమలకు టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.ఇక కాండ్రు కమల విషయానికి వస్తే.. 2009 నుంచి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. అంతకు ముందు మునిసిపల్ చైర్ పర్సన్‌గా కూడా ఆమె పని చేశారు. అంతేకాదు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుకు కమల వియ్యపురాలు.ఇన్ని కాలిక్యులేషన్స్‌తోనే  కమలకు మంగళగిరి టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు మంగళగిరిలో తమదే విజయమని.. రెండోసారి ఏపీ సీఎంగా జగన్ ఎన్నిక కావడం ఖాయమని ఎంపీ విజయసాయి రెడ్డి  ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు పర్మినెంట్‌గా తెలంగాణకు షిఫ్ట్ అవుతారని..ఓటమిని జీర్ణించుకోలేక రిటైర్మెంట్ ప్రకటించినా కూడా  ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని విజయసాయి అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =