రూ.3928.88 కోట్ల వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

AP CM YS Jagan Released Rs 3928 Crore Funds under YSR Rythu Bharosa-PM Kisan Scheme,AP CM YS Jagan Speech,YSR Rythu Bharosa,CM YS Jagan,YS Jagan,Jagan YSR Rythu Bharosa,YSR Rythu Bharosa Scheme,YSR Rythu Bharosa,CM Jagan Live,Rythu Bharosa Scheme,AP CM YS Jagan Live,Rythu Bharosa News,YSR Rythu Bharosa Status,CM Jagan Rythu Bharosa,YSR Rythu Bharosa Latest News,YSR Rythu Bharosa Live,YSR Rythu Bharosa Tomorrow,YS Jagan Speech,Jagan Rythu Bharosa,YSR Rythu Barosa,YSR Rythu Bharosa Scheme Details,Rythu Bharosa Today Live,Jagan Latest News,PM Kisan Scheme,PM Kisan Live,PM Kisan 2021,YSR Rythu Bharosa - PM Kisan,AP CM YS Jagan LIVE,CM YS Jagan Releasing YSR Rythu Bharosa,AP CM YS Jagan Released Rs 3928 Crore Funds,YSR Rythu Bharosa-PM Kisan Scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి గురువారం నాడు ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకం మొదటి విడత కింద రూ.3,928.88 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద వరుసగా మూడో ఏడాది మొదటి విడతలో భాగంగా 52.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,928.88 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.13750 అందిస్తుండగా, మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో సంక్రాతి సమయంలో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వైఎస్‌ఆర్‌ రైతు భరోసాతో రైతులకు మేలు జరిగే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. మూడో ఏడాది తొలి విడత సాయంగా 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.17029.88 కోట్లు విడుదల చేశామని అన్నారు. కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అన్నదాతలకు అండగా ఉండేందుకు నగదు జమచేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =