మంత్రుల కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాల భేటీ.. పరిష్కారం దిశగా అడుగులు?

Andhra govt employees strike over pay revision, Andhra Pradesh Government, Andhra Pradesh govt employees, AP Employee PRC Issue, AP Employee PRC Issue News, AP Employee Unions Attends Ministers Committee, AP Employee Unions Attends Ministers Committee Meeting, AP Employee Unions Attends Ministers Committee Meeting Regarding PRC Issue, AP Employees Unions Strike Regarding PRC Issue, Mango News, Ministers Committee Meeting Regarding PRC Issue, PRC Issue, PRC Issue in Ap

ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం అయింది. పీఆర్సీ సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘాలు చర్చించాయి. సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎస్‌ సమీర్‌ శర్మ, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. స్టీరింగ్‌ కమిటీ తరపున 20 మంది ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. పీఆర్సీ సాధన కమిటీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులైన బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కే వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు మరో 16 మందితో ఆరు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఐదు ప్రధాన డిమాండ్లతో పాటు వాటికి అనుబంధంగా మరో 9 డిమాండ్లు, ఇతరత్రా డిమాండ్లపై చర్చించామని పీఆర్సీ సాధన కమిటీ సభ్యులు తెలిపారు. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపాయి. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, శనివారం కల్లా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది. హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్‌ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది. హెచ్‌ఆర్‌ఏ, ఫిట్‌మెంట్‌ రికవరీ అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రస్తావించాయి. వాటిపై సానుకూలంగా చర్చలు జరిగాయి. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా శనివారం సాయంత్రం లోపు తుది నిర్ణయం తీసుకుంటాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =