రేపే తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం, నది స్నానాలకు అనుమతి లేదు

AP Endowment Minister, AP Endowment Minister Vellampalli Srinivas, Mango News Telugu, Minister Vellampalli Srinivas Press meet, Tungabhadra, Tungabhadra Pushkaralu, Tungabhadra Pushkaralu 2020, Tungabhadra Pushkaralu 2020 Dates, Tungabhadra Pushkaralu Latest News, Tungabhadra Pushkaram, Vellampalli Srinivas Press Meet Over Tungabhadra Pushkaralu

తుంగభద్ర పుష్కరాలు నవంబర్‌ 20, శుక్రవారం నుంచి ప్రారంభమై డిసెంబర్ 1, మంగళవారం వరకు 12 రోజులపాటుగా కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పారు. పుష్కరాల సమయంలో ఘాట్ లలోకి భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. కాగా పుష్కరాల్లో నది స్నానాలకు అనుమతి లేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అన్నారు.

ఇక్కడే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నది స్నానాలకు అనుమతి లేదన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి నవంబర్ 20, శుక్రవారం నాడు తుంగభద్ర పుష్కరాలకు వెళ్లనున్నారు. కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌ను సీఎం వైఎస్ జగన్ సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పుష్కర ఘాట్ సందర్శన సందర్భంగా సీఎం వెంట జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ పర్యటన ఇప్పటికే ఖరారయింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 11 =