ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్ ఆమోదం

AP Breaking News, AP Governor Approves APSRTC Act-2019, AP Governor Bishwa Bhushan, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, APSRTC Act-2019, Mango News
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును ఇటీవల జరిగిన శీతాకాలసమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి డిసెంబర్ 27, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గవర్నర్‌ పేరిట ఉత్తర్వులును విడుదల చేసింది. ఇక ఈ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన గెజిట్‌ నొటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం లభించడంతో ఇంతకాలం ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ, ఇకనుంచి పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మారిపోనుంది. అలాగే ఆర్టీసీలోని సుమారు 52 వేలమంది కార్మికులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు.

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =