సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం, ఏపీలో ప్రజలకు ఉచితంగా బియ్యం

10 KG Free Rice Distribution, 10 KG Free Rice Distribution To Poor In AP, 10 KG Free Rice to Poor, 10 KG Free Rice to Poor in May and June Months, A P State Civil Supplies Corporation Limited, Andhra Pradesh govt to distribute ration, AP Govt Decides to Distribute 10 KG Free Rice to Poor, AP Govt Decides to Distribute 10 KG Free Rice to Poor in May and June Months, AP Govt to Distribute 10 KG Free Rice, Free rice for May June to PDS and NFSA beneficiaries, Mango News

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా పేదలకు సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రజలకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధిచేకూరనుంది. మే మరియు జూన్‌ నెలల్లో రేషన్‌ వాహనాల ద్వారా ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.

కేంద్రం ఇప్పటికే ప్రకటించిన 5 కేజీల ఉచిత బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను ఏపీ ప్రభుత్వం అందించనుంది. అలాగే కేంద్రం ఇచ్చే ఉచిత రేషన్‌ బియ్యం 88 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుండగా,  కేంద్రం లబ్ధి అందని మరో 59 లక్షల మందికి కలిపి మొత్తం 1.47 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందజేయాలని సీఎం వైఎస్ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.764 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + ten =