ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. వైఎస్సార్‌ చేయూత దరఖాస్తుల గడువు పొడిగింపు

AP Govt Extends The Application Deadline of YSR Cheyutha Scheme Till Sep 11th, AP Govt Extends YSR Cheyutha Application, YSR Cheyutha Scheme Application Extended, YSR Cheyutha Scheme Application, Mango News, Mango News Telugu, AP Govt YSR Cheyutha Scheme , YSR Cheyutha Scheme, AP YSR Cheyutha Scheme, AP CM YS Jagan Mohan Reedy, YS Jagan YSR Cheyutha, AP CM YS Jagan Latest News And Updates, YSR Cheyutha News And Live Updates

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా మహిళల స్వావలంబనకై ఆర్ధిక సాయం అందించే పథకానికి దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. 45 సంవత్సరాలు నిండిన అర్హత కలిగిన మహిళలకు ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద ఆర్ధిక సాయం అందిస్తుండటం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ సంవత్సరం కొత్త లబ్ది దారుల్ని ఎంపిక చేసేందుకు నిర్ణయించుకున్న ప్రభుత్వం మరికొందరు మహిళలకు అవకాశం కల్పించేందుకు వీలుగా సెప్టెంబర్ 11 వరకు వైఎస్సార్ చేయూత గడువును పొడిగించారు. దీంతో వైఎస్సార్ చేయూత పథకం కింద సాయం పొందేందుకు ఆయా మహిళలకు దరఖాస్తులు సమర్పించడానికి సెప్టెంబర్ 11వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

కాగా వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లోని 45-60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఏడాదికి రూ.18,750 రుపాయల చొప్పున మొత్తం నాలుగు విడతల్లో రూ.75 వేల ఆర్ధిక సాయం అందించనుంది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు రెండు విడతలుగా అర్హులకు నగదును నేరుగా వారి ఖాతాలోకే జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది మహిళలకు రూ.9,179.67 కోట్ల రుపాయల్ని ప్రభుత్వం అందించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత నిధులు పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి కొత్త లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుదారులకు సమాచారం సరిగా అందలేదనే ఉద్దేశంతో మొదట 7వ తేదీ వరకు గడువు పొడిగించారు. నూతన లబ్ధిదారుల వినతుల మేరకు తాజాగా మరోసారి ఈ గడువును మరోసారి పొడిగించడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − one =